Friday 23 August 2019

సీరియస్ నెస్

ప్రతీ విషయాన్నీ జోవియల్ గా తీసుకుంటే ఎలా? అప్పడప్పుడైనా కొంచెం సీరియస్నెస్ ఉండాలి. లేకపోతే జీవితం నవ్వులపాలు అవుతుంది. ఈ మాటలు ఒక ఫ్రెండు అనగా విని, నేనూ కొంచెం సీరియస్ పోస్టు పెట్టడానికి ప్రయత్నించాలని, పొద్దుటి నుంచి అదే పనిమీద ఉన్నా.

నిన్న రాత్రి ఇంటికొచ్చేసరికి, బాగా లేటయ్యింది. సీరియస్ విషయం డిస్కస్ చేయాలని ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేశారు. దాంతో సినిమా కెల్దామని ఇంట్లో పొద్దుటే చెప్పి ఆఫీసుకు బయలుదేరిన నాకు ఈ మీటింగ్ వల్ల కుదరలేదు. కనీసం ఫోను చేసే అవకాశం కూడా లేకపోయింది. ఎదురు చూసి, ఎదురు చూసి, భార్యాపిల్లలు అలానే నిద్రపోయారు. బాగా పొద్దు పోయిన తరువాత ఇంటికెళ్ళేసరికి ఆవిడ నిద్రకళ్ళతోనే తలుపుతీసి నే చెప్పేది వినకుండా సీరియస్ గా బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఓపికలేక అలానే సోఫాలో కూలిపోయా. లేచేసరికి బాగా పొద్దు పోయింది. అప్పటికే తయారయ్యి పిల్లలు సీరియస్ గా వాళ్ళ స్కూల్ కెళ్ళే హడావిడి లో మునిగిపోయారు. ఆవిడ ముఖంలో నిన్నటి తాలూకు సీరియస్ నెస్ తగ్గలేదు. ఇక చేసేదేంలేక తయారయ్యి ఆఫీస్ కి బయలుదేరబోతుంటే పక్కింటి రాజ్యంగారు కంగారుగా వచ్చి, అన్నయ్య గారూ! ఆయనికి పొద్దుటనుంచీ చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, ఇంట్లో నేను తప్పు ఎవరూలేరు,  కాస్త సహాయం చేస్తారా? అని అడిగితే సహాయం కోసం వెళ్ళా. ఆయన పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేయమంటే ఐసీయూ లో అడ్మిట్ చేశాం. అక్కడ చాలమంది కండిషన్ సీరియస్ గా ఉంది. వార్డు ఇన్చార్జి డాక్టర్ వచ్చి పెషెంట్  కండిషన్ చూస్తూనే అడ్వాన్స్ పాతిక వేలు కట్టమని సీరియస్ గా చెప్పాడు. తప్పేది లేక ఆవిడ దగ్గర ఉన్న ఇరవైకి నా ఏటిఎమ్ లో ఐదు కలిపి అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాం. ఈ లోగా ఆఫీస్ నుంచి ఫోను. ఏంటి లేటు? బాస్ సీరియస్ అవుతున్నారని. అలాంటి పరిస్థితుల్లో రాజ్యంగారిని ఒంటరిగా వదలటం ఇష్టంలేక ఆగిపోయాయి, వాళ్ళాయన సీరియస్ నెస్ అటువంటిది‌. డాక్టర్ లు అప్పుడప్పుడు వచ్చి మందులచీట్లు ఇస్తూంటే నేనే నా ఎటిఎమ్ లో నుండి పే చేస్తున్నా. రాజ్యం గారి కుటుంబం అంటే మాకు గౌరవం. ఈ లోగా నాభార్య కాఫీ, టిఫిన్లు తో సహా వచ్చింది. రాజ్యం గారిని ఓదార్చి టిఫిన్ పెట్టింది. నాకూ ఇంత టిఫిన్ పెట్టి, కాఫీ తాగమంది. ఆవిడ ముఖంలో ఇదివరకటి సీరియస్ నెస్ లేదు. సాయంత్రానికి మా పక్కింటాయన పరిస్థితి మెరుగు పడింది. విషయం అంతా సీరియస్ కాదనగానే అందరం ఊపిరిపీల్చుకున్నాం. ఈ లోగా రాజ్యంగారి బంధువులొచ్చారు. మేం ఇంటికొచ్చేముందు ఆవిడతో అవసరం అయితే పిలవమని, మేం చెప్పే మాటలు మొక్కుబడికి కాదని సీరియస్గా చెబుతున్నామని చెప్పాం. ఆవిడ కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలిపింది. ఇంటికొచ్చేముందు ఆఫీస్ కు ఫొన్ చేసి ఎటువంటి సీరియస్ పరిస్థితుల్లో సెలవు పెట్టిందీ బాస్ కి చెప్పా. మొత్తం విని ఆయన మంచిపని చేశావ్ గుడ్ అన్నారు. బతీకుజీవుడా అనుకుని ఇంటికెళ్ళి స్నానం చేసి బయటకొచ్చేసరికి మంచి ఘుమఘుమలాడే  కాఫీ ఇచ్చింది నా ఇల్లాలు. ఆవిడ ముఖంలో ప్రసన్నత నామీద అభినందన కనపడింది సీరియస్లీ.

ఈవేల్టికి ఈ మాత్రం సీరియస్ నెస్ చాలని అనుకుందో ఏమో, నవ్వుతూ మాట్లాడటం మొదలెట్టింది. హమ్మయ్యా అనుకున్నా.

మీక్కూడా ఈ సీరియస్ నెస్ సరిపోయింది అనే అనుకుంటున్నా. ఇంత సీరియస్ గా ఎవరూ ఇప్పటి వరకూ రాసి ఉండరు. నమ్మకం లేకపోతే చూడండి పోస్టు నిండా సీరియస్ నెస్ అనేది ఎన్ని సార్లొచ్చిందో!

యాంగ్రీ యంగ్ మాన్ అమితాబ్
సీరియస్ రైటర్ శ్రీనివాస్ అని మీరే అంటారు.

SSS SRINIVAS VEMURI