Monday 6 May 2019


శృంగార చిహ్నం.

గడచిన రాత్రి, శృంగార పారవశ్యంలో,
ప్రియురాలు చేసిన నఖ క్షతాలకు
కందిపోయిన ప్రియుని మేనిలా....
ఎంత ఎర్రగా ఉందో చూడండి!
ఈ అగ్నిపూల చెట్టు.

ఇంత అందంగా ఎవరు వర్ణించ గలరు చెప్పండి
మహాకవి కవి కాళిదాసు కాక!

అందుకే అన్నారు, ఉపమా కాళిదాసస్య అని!

ఉపమాలంకారం ప్రయోగించడంలో కాళిదాసును
మించిన కవి, న భూతో న భవిష్యతి.

శ్రీకాకుళం,గుజరాతీపేట, పురుషోత్తమ నగర్ కాలనీ, వేంకటేశ్వరస్వామి వారి గుడికి వెళ్ళే దారిలో ఉంది ఈ చెట్టు.

ఆయన మోదుగ చెట్టుకు చెప్పిన ఉపమాలంకారం, ఈ గుల్ మొహర్ చూడగానే స్ఫురణకు వచ్చి, కెమేరా క్లిక్ చేశా, మీ కోసం, నచ్చితే ఓ కామెంట్ పెట్టండి, ఇండియన్ షేక్స్పియర్ కు నివాళిగా.

మన వారిని మనం గౌరవించుకోవటంలో ఒక గర్వం ఉంది.