Monday 12 August 2019


అంతే!

అగ్ని లేని వంట,
సూర్యుడు లేనప్పుడు తిండి,
యజమాని లేని కుటుంబం,
గురువులేని విద్య,
సొంత ఆలోచన లేని విద్య,
వినయం లేని పాండిత్యం,
రాజులేని రాజ్యం,
పొదుపు లేని సంపాదన,
ఖర్చు చేయటం రాని రాబడి,
అవసరానికి ఉపయోగించని ధనం,
తనకు మాలిన ధర్మం,
పరిమితి తెలియని దానం,
నిశ్చితి లేని ఆలోచన,
ఆత్మాభిమానం లేని కీర్తి,
పరుల పంచన జీవితం,
ఆరోగ్యం లేని కలిమి,
అనుభవించటం చేతకాని నిర్వాకం
ఎన్నటికీ రాణించవు....