Thursday, 5 July 2018


Light Bulb, Light, Halogen, Bulb, Lamp


ఇంటిపెద్దగా, కుటుంబ యజమానికి మనకీ  కొన్ని బరువు బాధ్యతలు ఉంటాయి.
అవి నెరవేర్చినరోజు చాలా సంతోషంగా ఉంటుంది.
ఎవరి కోసమో కాదు మనకోసం, మన ఆత్మ సంతృప్తి కోసం, మనం బాధ్యతలు స్వీకరించాలి.
ఈరోజు సుదినం, మాకుటుంబంలో వెలుగు నిండిన సుదినం.
అదీ నావల్ల జరిగినందుకు నాకు సంతోషం.
పైకి చెప్పలేట్లేదు కానీ పిల్లలు కూడా  లోపల సంతోషిస్తున్నారనే అనుకుంటున్నా.
ఆవిడకి నేనేం చేసినా పెద్ద తృప్తిగా  అనిపించదు. అందుకే ఆవిడని వదిలేశా!
చాలా రోజులనుంచి బాధిస్తున్న సమస్యకి ఈ రోజు ఒక ముగింపునిచ్చా.
నా కుటుంబంలో వెలుగు నింపేందుకు మాడిన ట్యూబ్ లైట్ మార్చా.
బాధ్యతలు తీర్చటం అంటే ఇదేకదా!