Showing posts with label chamakkulu. Show all posts
Showing posts with label chamakkulu. Show all posts
Saturday, 4 May 2019
వందనం
వందనం
సంగీత సాహిత్యాల్లానే
వ్యాపార రాజకీయాలు
పుట్టుకతో అబ్బాల్సిన విద్యలు
శ్రద్ధతో కూడిన పాండిత్యం
ఒకదానిలో ఉంటే
పరిశీలనతో కూడిన లౌక్యం
వేరొక దానిలో ఉంటుంది
శాస్త్రం చదివి కొత్తదనాన్ని
ఆవిష్కరిస్తారు ఒకరు
కొత్త దనాన్ని ఆవిష్కరించి
శాస్త్రం రాసుకోమంటారు ఒకరు
లాలిత్యం ఒకరిది
దృఢత్వం ఒకరిది
అభిరుచి ఉన్నవారు
మొదటివారిని అనుసరిస్తే
అవకాశాలు వెతికే వారు
రెండో వారిని అనుసరిస్తారు
ఇద్దరికీ చప్పట్లు కొడతారు
దానికే పొంగి ధనం తృణప్రాయం
అంటారు ఒకరు
పెరిగిన చప్పట్లతో ధనసృష్టి
చేస్తారు ఒకరు
సరస్వతిని సృష్టించేది ఒకరు
లక్ష్మీ దేవిని సృజించేది ఒకరు
ఒకరిమీద ఒకరు ఆధారపడతారు
జనబాహుళ్యాన్ని ప్రభావితం చేస్తారు
సరస్వతీ పుత్రులకి
లక్ష్మీ పుత్రులకి
వందనం
ఎందుకంటే వాళ్ళే
- సమాజాన్ని నడిపిస్తున్నారు.
Friday, 3 May 2019
Wednesday, 1 May 2019
Better you know it first

( The pictures posted here are copyright free images, if anybody has an objection, please inform, I will remove it immediately)
వివరం తెలుసుకో!
దారికాచి,ధనం దోచేవాడికి, కొంత కాలమే ఖైదు
అదే, దారికాచి మనసు దోస్తే, జీవితాంతం జైలు
దోచేముందు వివరం తెలిస్తే మంచిది.
Blossom

( The images posted here are copyright free, if anybody has an objection, pl inform, I will remove)
నీ మనసులో నా మీద ప్రేమ పూసిందో లేదో తెలియదు కానీ....
రోజూ మనం బయట తిన్న తిండి వల్ల నా నోరు పూసింది.
Tuesday, 30 April 2019
I am also writing

(All the images are used here are royalty free images, if anybody has an objection, please inform, I will remove them immediately)
నేనూ...రాస్తున్నా....
ఈ మధ్య ఖాళీ దొరికినప్పుడల్లా పాటలు రాస్తున్నా. అవి విన్న వాళ్ళందరూ చాలా బావున్నాయని మెచ్చుకుంటున్నారు. అందులో కొన్ని మీ కోసం.
జగమేమాయ...బ్రతుకేమాయ
వేదాలలో సారమింతేనయా...
వేదాలలో సారమింతేనయా...
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
ఓడిపోలేదోయ్....
ఓడిపోలేదోయ్....
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురుచూసి మోసపోకుమా...
ఎదురుచూసి మోసపోకుమా...
ఈ వేళ కూడా రాద్దామని పెన్నూ కాగితం తీసుకుని రేడియో ముందు కూర్చున్నా వాతావరణం సరిలేక, పాటలు వినబడలేదు...
అప్ సెట్ అవ్వద్దే బాగా వినిబడితే, రేపు రెండు రాస్తా...
రాయాలన్న ఆర్తి నాలో
వినాలన్న ఉత్సుకత మీలో
ఉన్నంతసేపూ ఈ ప్రయాణం
ఎవ్వరూ ఆపలేరు
హ........
రాయలేకపోయా...సారీ...
అప్ సెట్ అవ్వద్దే బాగా వినిబడితే, రేపు రెండు రాస్తా...
రాయాలన్న ఆర్తి నాలో
వినాలన్న ఉత్సుకత మీలో
ఉన్నంతసేపూ ఈ ప్రయాణం
ఎవ్వరూ ఆపలేరు
హ........
రాయలేకపోయా...సారీ...
Monday, 29 April 2019
Please suggest an Idea, if you know?

మీకు తెలిస్తే చెప్పరూ!!!
నా పిల్లలిద్దరూ నాకు రెండు కళ్ళు అంటూ మురిసి పోతూ పెంచుకున్నారాయన. పెరిగి పెద్దవారయ్యారు పిల్లలు. చూసుకోవలసిన సమయం వచ్చేసరికి, రెండుకళ్ళూ చత్వారం తో బాధ పడుతున్నాయని గ్రహించారు.
చేసేదేముంది, వృద్ధాశ్రమంలోచేరి చత్వారపు జోడు తుడుచుకుంటూ అనుకుంటున్నాడు, "కళ్ళకు రోగం వస్తే దృష్టి సరిచేసేందుకు జోడు వచ్చింది, కానీ జోడు దొరికిన పిల్లలకు దృష్టి ఎందుకు పోయిందబ్బా? అని".
మీకు తెలిస్తే చెప్పరూ!! ఆయన కళ్ళు బాగుపడే ఉపాయం.
Thursday, 5 July 2018
వెలుగు

ఇంటిపెద్దగా, కుటుంబ యజమానికి మనకీ కొన్ని బరువు బాధ్యతలు ఉంటాయి.
అవి నెరవేర్చినరోజు చాలా సంతోషంగా ఉంటుంది.
ఎవరి కోసమో కాదు మనకోసం, మన ఆత్మ సంతృప్తి కోసం, మనం బాధ్యతలు స్వీకరించాలి.
ఈరోజు సుదినం, మాకుటుంబంలో వెలుగు నిండిన సుదినం.
అదీ నావల్ల జరిగినందుకు నాకు సంతోషం.
పైకి చెప్పలేట్లేదు కానీ పిల్లలు కూడా లోపల సంతోషిస్తున్నారనే అనుకుంటున్నా.
ఆవిడకి నేనేం చేసినా పెద్ద తృప్తిగా అనిపించదు. అందుకే ఆవిడని వదిలేశా!
చాలా రోజులనుంచి బాధిస్తున్న సమస్యకి ఈ రోజు ఒక ముగింపునిచ్చా.
నా కుటుంబంలో వెలుగు నింపేందుకు మాడిన ట్యూబ్ లైట్ మార్చా.
అదీ నావల్ల జరిగినందుకు నాకు సంతోషం.
పైకి చెప్పలేట్లేదు కానీ పిల్లలు కూడా లోపల సంతోషిస్తున్నారనే అనుకుంటున్నా.
ఆవిడకి నేనేం చేసినా పెద్ద తృప్తిగా అనిపించదు. అందుకే ఆవిడని వదిలేశా!
చాలా రోజులనుంచి బాధిస్తున్న సమస్యకి ఈ రోజు ఒక ముగింపునిచ్చా.
నా కుటుంబంలో వెలుగు నింపేందుకు మాడిన ట్యూబ్ లైట్ మార్చా.
బాధ్యతలు తీర్చటం అంటే ఇదేకదా!
ఎందుకో నాకు తెలియాలి!

ఏవిటో ఈ మనుషులు? మంచిగా మాట్టాడినా, అర్థం చేసుకోకుండా ఏదో ఒక వంకపెట్టి ఏడిపిస్తూ ఉంటారు.
వీళ్ళతో ఎలా వేగాలో అర్థం కావటం లేదు.
లేకపోతే ఏవిటి? చెప్పండి. జ్ఞానం అన్నా తెలివి అన్నా ఒకటేకదా. ఉదయం అన్నా తెల్లారటం అన్నా ఒకటే కదా.
మొన్నామధ్య ఆయనేవరో చక్కటి ఆధ్యాత్మిక బోధ చేశారు.
సంతోషం పట్టలేక "ఏవండోయ్! మీ తెలివి తెల్లారినట్టే ఉందని" ఉపన్యాసం మధ్యలో మనఃస్ఫూర్తిగా అన్నా
అంతే! ఆయనతో సహా, అందరూ కొట్టినంత పని చేశారు.
సంతోషం పట్టలేక "ఏవండోయ్! మీ తెలివి తెల్లారినట్టే ఉందని" ఉపన్యాసం మధ్యలో మనఃస్ఫూర్తిగా అన్నా
అంతే! ఆయనతో సహా, అందరూ కొట్టినంత పని చేశారు.
ఏవిటో ఈ లోకం, నా భావాన్ని ఎప్పటికి సరిగా అర్ధంచేసుకుంటుందో?
Subscribe to:
Posts (Atom)
