Thursday, 5 July 2018



Image result for i should know


ఎందుకో నాకు తెలియాలి!

ఏవిటో ఈ మనుషులు? మంచిగా మాట్టాడినా, అర్థం చేసుకోకుండా ఏదో ఒక వంకపెట్టి  ఏడిపిస్తూ ఉంటారు.
వీళ్ళతో ఎలా వేగాలో అర్థం కావటం లేదు.
లేకపోతే ఏవిటి? చెప్పండి. జ్ఞానం అన్నా తెలివి అన్నా ఒకటేకదా. ఉదయం అన్నా తెల్లారటం అన్నా ఒకటే కదా.
మొన్నామధ్య ఆయనేవరో చక్కటి ఆధ్యాత్మిక బోధ చేశారు.
సంతోషం పట్టలేక "ఏవండోయ్! మీ తెలివి తెల్లారినట్టే ఉందని" ఉపన్యాసం మధ్యలో  మనఃస్ఫూర్తిగా అన్నా
అంతే! ఆయనతో సహా,  అందరూ కొట్టినంత పని చేశారు.
ఏవిటో ఈ లోకం, నా భావాన్ని ఎప్పటికి సరిగా అర్ధంచేసుకుంటుందో?