Tuesday 9 July 2019



అవునా? కాదా?

పంచదశ కళల పిమ్మట వచ్చే అమావాస్యతో
షోడశకళలు పూర్తవుతాయి చంద్రునిలో...
షోడశ కళానిధి జీవన భ్రమణంలోనే,
ఒక కళ చీకటి అయినపుడు, సామాన్యులం
మన జీవితంలో కష్టం ఉండకుండా ఉంటుందా?
చాంద్రమానం మొత్తంలో పూర్తి చీకటి ఒక్కరోజే
మన జీవితంలోనూ  పూర్తి కష్టాలు కొన్నే
అంతటితోటే  భ్రమణం ఆగిపోతే
పున్నమి రాదు, వెన్నెల లేదు
కొన్ని కష్టాలకే జీవితం ఆగిపోతే
ఆనందం రాదు, సుఖం ఉండదు
వృద్ధి, క్షయాల్లో కూడా
వెలుగు అంటిపెట్టుకునే ఉంటుంది
తోడొచ్చే వెలుగును చూడు,
ఎప్పుడో వచ్చే చీకటిని కాదు
అప్పుడే.....
జీవితం ఆనందంగా అనిపిస్తుంది
ఆశ ముందుకు నడిపిస్తుంది.

SSS SRINIVAS VEMURI
Srikakulam