Thursday 4 July 2019



మధ్య తరగతి జీవితం

అయితే కోటీశ్వరునిగా, లేక పేదవానిగా పుట్టడం మంచిదా?

అతి సర్వత్ర వర్జయేత్! ఆ చివర, ఈ చివర ఉండకూడదు. అన్నిరకాల ఆనందాలు దక్కేది, మధ్య తరగతికే.

జీవితం బాలెన్స్ అయ్యేది, కాటా సూచీ మధ్యకు వచ్చి నిలబడినపుడే.

జీవితం సమతా స్థితిలో, జీవన విధానం సమతౌల్యంలో ఉండటం ప్రధానం అని కదా! పెద్దలంటారు.

మధ్యతరగతి జీవితం సకల అనుభవాల సమాహారం. చీకటి లేని వెలుగు, కష్టంలేని సుఖం, కలిమి ఇచ్చే సుఖం, కష్ట ఫలాన్ని అనుభవించే సమయం లేనప్పుడు ఆనందం ఉండదు.

సంగీత, సాహిత్య, హాస్య, శృంగార, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాలను తృప్తి మీర ఇచ్చేది, దేశ సంపదకు జీవగర్రగా నిలిచేది మధ్య తరగతి జీవనమే. సాంస్కృతిక పునరుజ్జీవనానికి వెన్నెముకగా నిలిచింది, పారిశ్రామిక విప్లవానికి చేయూత వచ్చిందీ మధ్య తరగతే.

అతిగా తినటం, ఏమీ తినక పోవటం ఏ రకంగా మంచిది కాదో, సంపద కూడా అటువంటిదే. మధ్య తరగతిలో పుట్టినందుకు సంతోషించండి. అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఇక్కడే ఉంటుంది.

SSS SRINIVAS VEMURI
SRIKAKULAM