Tuesday 3 March 2020

జాతీయ రక్షణ దిన శుభాకాంక్షలు

ఎండకు మసులుతూ,
వర్షానికి నానుతూ,
చలికి వణుకుతూ,
దొరికింది తిని,
లేనప్పుడు పస్తుండి
ఎండనక, వాననక,
కొండనక, కోననక,
పుట్టిన ఊరనక,
పరాయి ఊరనక,
అన్నీ నావే,
దేశం నాదే అని,
ముక్కూ మొహం తెలియని ప్రజలకోసం,
నేనున్నానని భరోసా ఇస్తూ,
ప్రాణాలకు  తెగించి,
అహరహం శ్రమించి
దేశం కోసం రక్షణనిచ్చే
భారతమాత ముద్దు బిడ్డలారా,
నాదేశ వీర సైనికులారా,
తుపాకీని దండంగా,
సైనిక దుస్తులే కాషాయంగా,
దేశ రక్షణే పరమావధిగా,
ఆలు బిడ్డలను విడిచి,
మీదైన ధర్మస్థపన చేసే
హృదయపీఠాధిపతులు మీరు,
మీ సేవ అనుపమానం,
మీకు వందనం
మీరు మాకు వందనీయులు,
భారతజాతి మొత్తం తెలుపుతోంది
జాతీయ రక్షణ దినోత్సవ శుభాకాంక్షలు.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042